21, నవంబర్ 2015, శనివారం

9440277172b.blogspot.com

బహువ్రీహి సమాసం:-అన్య పదార్ధ ప్రధానం.అనగా సమాసగత పదములు బోధించే వస్తువులను గాకవేరొకవస్తువును బోధించేది బహువ్రీహి సమాసమనబడును.ఉదా:-నీలవేణి ,దశరధుడు 
విగ్రహ వాక్యంలో చివర కలవాడు,కలది అనే పదములు కనబడును.ఇదే దీని ప్రత్యేకత.
తత్పురుష భేదముల బట్టి సంబంధ -కర్మ -కారక బహువ్రీ హు లును,కర్మదారయభేదముల బట్టి విశేషణ -ఉపమాన-రూపక -మధ్యమపద లోప -బహువ్రీ హులు ఏర్పడుతున్నవి.
సంబంధ బహువ్రీహి:-విగ్రహంలో సమాసపద బోధిత వస్తువును తెలిపేదిసంబంధవాచకవిభక్తిలోఉండుటచేసంబంధబహువ్రీ హులు.ఉదా:-చక్రపాణి 
కర్మబహువ్రీహి:విగ్రహంలో కర్మవాచక విభక్తి ఉండుటచే కర్మబహువ్రీహి అనబడును.ఉదా:-ప్రాప్తయౌవనుడు.
కారక  బహువ్రీహి:-విగ్రహంలో తనశబ్దముచేత -కు -నుండి-అందు అనే విభక్తి ప్రత్యయ -విభక్తికములు వచ్చుటచేతనుఇవి కారక బహువ్రీహి సమాసములు . ఉదా:-కృతకార్యుడు.
విశేషణ బహువ్రీహి:-ఇది సంబంధ బహువ్వలెనుండును.ఉదా:-పీతా౦బరుడు  
ఉపమాన బహువ్రీహి:-ఉపమాన కర్మధారయ౦.ఉదా:-చంద్రముఖి 
రూప క బహువ్రీహి:-యశోధనుడు 
మధ్యమపదలోపి:-కలవాడు,కలది అనే అర్ధము కలది.సమాస గత పదముల నడుమ విభక్తి-వైభక్తికములే కాకఇతర పదములు లోపించినవి.ఉదా:-గజాననుడు
 నై బహువ్రీహి:-అనంతుడు    (లేనిది లేనివాడు అనునవివిగ్రహ వాక్యాల్లో చేరినవి ) 
ఆచ్చి కబహువ్రీహి:ఆచ్చికపదముల కలయిక వలన ఏర్పడిన బహువ్రీహిసమాసాల్లోని వర్ణ లోపాది విశేష కార్యములు ఉదాహరణలబట్టిగ్రహించవలెను
కారకీభావసమాస౦:-కారక కల్పమైన ఉపసర్గాది పదాంశం గాని,పదం గాని,రెండవపదమైన నామంతో కలిసి ఏర్పడ్డ సమాసంఏకముగా కారక కల్పమై క్రియతో అన్వయించితే దానికి కారకీభావ సమాసం అని పేరు.ఉదా:యధాశక్తి 
ఇవి పూర్వపదార్ద  ప్రధానంగా గలది.పూర్వపదము అవ్యయమై ఉండునుగాన వీనిని అవ్యయీభావసమాసం అనికూడా అందురు.      

19, నవంబర్ 2015, గురువారం

                        భాష-పదము-సమాసాలు 
    ఎక్కువ భావం తక్కువ పదాలలో ఇమిడ్చి సంగ్రహంగా చెప్పడమే సమాసప్రయోజనం.రెండు పదములు ఏక పదములుగా కలియునప్పుడు కలుగు విభక్తిలోపమును పొందియుండినపదముల సంగ్రహ స్వరూపము  సమాసమనబడును.సమాసగతపదాలనువిడదీసిలుప్తవిభక్త్యాదులను  పూరించి అర్థం వివరించడమే విగ్రహమందురు.ఇక్కడ పదాలు నాలుగురకాలు.1.తత్సమము 2.తద్భవము 3.దేశ్యము.
4.అన్య దేశ్యములు.విగ్రహవచనములో వీలైనతవరకు సమాసాం త గత పదాలనే  వాడవలెను.
1.సాంస్కృతికసమాసాలు:-సంస్కృతభాషలో సంస్కృత ప్రాతిపదికల సంయోగం వల్ల ఏర్పడ్డవి సంస్కృత సమాసాలు.   వాటి చివర తెలుగు ప్రత్యయాలు చేరగా సిద్ధించినవిసాంస్కృతి కసమాసాలు.ఉదా:-దండితాడిత భుజంగః -ఇది సంస్కృత సమాసము.దండితాడితభుజంగము --ఇది సాంస్కృతిక సమాసం.
ఎ )సిద్దము:కేవలము సంస్కృత పదములకగు సమాసము.
ఉదా:లక్ష్మీ వల్లభుడు 
బి)సాధ్యము:కేవలము తత్సమపదములకగు సమాసము.
ఉదా:తటాకంబునుదకము
2.తత్సమ సమాసం.:--సమాసంలోనితొలిపదంగాని,మలిపదం గానిలేక రెండునుగాని తత్సమాలైతే ఆ సమాసం తత్సమ సమాసం ఔతుంది.ఆచ్చికముతో తత్సమం కలిపినసమాసాల సంఖ్యహెచ్చు.ఉదా:-చలికాలం 
తత్సమంతో తత్సమంకలిసి యేర్పడ్డ సమాసాలు:మాయలోకం 3.ఆచ్చికసమాసాలు :-కేవల ఆచ్చిక పదముల సంయోగంవల్ల ఏర్పడ్డవి ఆచ్చిక సమాసాలు.ఉదా:-కనువిందు,పలువరుస 
4.మిశ్రసమాసాలు:-సమాస ప్రాతిపదికలతో ఆచ్చిక పదములుచేరి ఏర్పడ్డవి,ప్రత్యయా దిలోపముకల ఆచ్చిక పదములతో తత్సమములు చేరి ఏర్పడ్డవిమిశ్రసమాసాలు అందురు. 
లుక్సమాసాలు,అలుక్సమాసాలు,లుగాలుక్సమాసాలు అని మూడు రకములున్నవి .
విభక్తిప్రత్యయములులోపించినవి.లుక్సమాసములు.తత్పురుషాదులు ఇందులోచేరును.
విభక్తివైభక్తి కాదిలోపములేనివి అలుక్సమాసములు.విభక్తి ప్రత్యయముతో కూడిన తొలి పదంతో రెండవపద0 ఏర్పడ్డ సమాసాలుఇవి.  తెలుగులో వీటిసంఖ్యస్వల్పమైనది.
పదములు రెండురకములు:రూఢములు ,యౌగికములు  ,
ఒకభాషలో వేరోకపదమునుండిఏర్పడకస్వయంసిద్ధములైఉన్న పదములు రూఢ ములు
   సమాసగత పదముల పరస్పర అన్వయమును బట్టి సమా సములు ఆరు రకములు.   
1.తత్పురుష 2 .కర్మధారయ 3.ద్విగు 4.ద్వంద్వం.5.బహువ్రీహి 6.అవ్యయీభావ .
ఇక పై వానిని పరిశీలిద్దాము.
1.తత్పురుష:-ఉత్తరపదార్ధప్రధానమైనది.అనగా సమాసంలోని రెండు పదాలలోను,రెండవ పదం అర్ధం ప్రధా నంగాగలది తత్పురుష సమాసమనబడుతుంది. దీనిలోతోలి పదము తరువాత తరచుగా సంబంధ వాచక ,కర్మవాచక ,కారకవాచక -ప్రత్యయాలలో ఏదో ఒకటి గాని ,కారకీయ వైభక్తికంకాని లోపిస్తుంది.విభక్తి ప్రత్యయాల లోపాన్ని బట్టి ఆ యా తత్పురుష ల పేర్లు ఏర్పడినవి
----------------------------------------------------------------------------
వ.సoఖ్య                తత్పురుష                       ఉదాహరణ                                                       సమాసంపేరు
-------------------------------------------------------------------------------     1.               ప్రధమా                                        పూర్వకాయo 
  2 .                ద్వితీయ                                       నెలతాల్పు 
  ౩.                 తృతీయ                                       శరాహతము 
  4.                  చతుర్థీ                                           భూతబలి
   5.                  పoచమీ                                          చోరభయం            6.                   షష్ఠి                                               రాజభటుడు 
   7.                   సప్తమీ                                           మాటనేర్పరి 
   8.                        నై                                             అధర్మము 
--------------------------------------------------------------------------------- కర్మతత్పురుష :-పూర్వపదములొ కర్మ వాచక విభక్తి లోపం ఉంటే అది కర్మ తత్పురుష సమాసం ఔతుంది.
ఉదా:-రస పిపాసుడు (రసమును పానం చేయగోరువాడు)  
కారక తత్పురుష సమాసం :-పూర్వపదానికిఉత్తరపదంతోకారకాన్వయం ఉంటే అది కారక తత్పురుష సమాసం ఔతుంది.               
   ఉదా:-రోగ పీడితుడు.(రోగమువల్ల పీడితుడు)

కర్మధారయసమాసం :--ఇది తరచుగా విశేషణం తో నామం కలిసి ఏర్పడ్డ సమాసం.తత్పురుష సమాసం వలె కర్మధారయం కూడా సమాసంలోని ఉత్తర పదం అర్ధం ప్రధానంగా గలది.తత్పురుషం లోనిరెండు పదాలును రెండు భిన్నవస్తువులను బోధించగా కర్మధారయంలోనిరెండు పదాలును ఒకే వస్తువును బోధించును.ఇదే దీని ముఖ్య లక్షణము.విగ్రహంలోని నామలింగమును బట్టి విశేషణ రూపం మారుతుంది.సంస్కృత వ్యాకరణానుసారంగా అసాధువులే అయినా తెలుగులో ప్రచుర ప్రయోగం కలవి.   ఉదా:-మహదైశ్వర్యము
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం:-దీనిలో తోలిపదము విశేషణము రెండవది నామం.ఉదా:-ధవళ వస్త్రము.(ధవళమైన వస్త్రము)
విశేష ణ ఉత్తరపదకర్మధారయ సమాసం -దీనిలోమొదటిపదo  నామం,రెండవపదం విశేషణం -ఉదా:-నరాధముడు.
విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం:-ఏకవస్తుబోధకములైన రెండు విశేషణములు కలిసి ఏర్పడ్డ సమాసం ఇది.ఉదా:-గానం మృదుమధురం 
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:-ఈ సమాసంలో తొలిపదం  ఉపమాన వాచకం రెండవది ఉపమేయ వాచకం సరిపోల్చబడ్డ వస్తువు ఉపమేయం ;అదిదేనితో సరిపోల్చబడునో అది ఉపమానం ఉదా:-పద్మముఖం 
ఉపమానోత్తరపద కర్మధారయ సమాసం:-దీనిలో ఉత్తరపదం ఉపమానవాచకం మొదటి పదం ఉపమేయవాచకం.
ఉదా:-ముఖపద్మం 
అవధారణ పూర్వపదకర్మ ధారయ సమాసం :సంసారసాగరం సంభావనాపూర్వపద కర్మధారయ సమాసం :-వ్యక్తి వాచక నామంతో ఆ పేరు గల జాతివాచకనామం సమసించగాఈ సమాసం ఏర్పడుతుంది.ఉదా:-హిమాలయ పర్వతం
రూపకకర్మధారయసమాసం :- తొలిపదం బోధించే వ్యక్తి లేక వస్తువు నందు రెండవపదం బోధించే వ్యక్తిలేక వస్తువుధర్మం ఆరోపితమైతే ఆసమాసం రుఉపక కర్మధారయ సమాసం ఇక్కడ రెండింటికిని అభేదం.ఉదా:-గురుదేవుడు 
ద్విగుసమాసం:-సంఖ్యా వాచకం పూర్వపదం గా ఉంటె అది ద్విగుసమాసం ఔతుంది.ఉదా:-త్రినేత్రుడు 
ద్వంద్వ సమాసం:-సమాసంలోని రెండు పదముల అర్థం ప్రదానముగాగలది.ఉదా:-శివకేశవులు .   
ఇది రెండు విధములు.1.ఇతరేతరద్వన్ద్వం:-ఒకే పదంతో అన్వయంగల అనేక సమసత్తాక పదముల కలయిక వల్ల  ఏర్పడ్డ సమాసం ఇతరేతర ద్వంద్వం ఉదా:-స్త్రీపురుషులు (ఇది బహువచనాం తo .ఇదే  వ్యవహారంలో  తరచుగాకన్పిస్తుంది.)
2.సమాహార ద్వంద్వం.:-సమాసగత పదబోధిత వస్తువుల మొత్తము అర్ధమైనప్పుడు సమాసం ఏకవచనాంతమైసమాహార ద్వంద్వం అనబడును.ఉదా:-పాణిపాదము,అహర్నిశలు