11, డిసెంబర్ 2015, శుక్రవారం

                        ఉల్లాసము-పదము-సమాసాలు 
ఏక శేష సమాసము:ఎ )సమాన రూపములుగల పదముల యేకశేషము సరూపై కశేషము.ఏక విధ రూపములుగల అనేక పదములు సమాసముగా నేర్పడినచో,అందొక్కపదమునకు మాత్రము బహువచనప్రత్యయమగును. ఉదా:-
రాముడు,రాముడు=రాములు 
బి)భిన్న రూపములుగల పదముల ఏక శేషమును నిరూపైకశేష మందురు.ఉదా:-మాత + పిత=పితలు. 
పుత్రి+పుత్రుడు=పుత్రులు.
అవ్యయీభావ సమాసము:-సమాసమునందలి పూర్వ పదము అవ్యయమైనచో అది అవ్యయీభావ సమాసమగును.అవ్యయము యొక్క అర్దము ప్రధానము గా నుండును గనుక యిది అవ్యయీభావ సమాసము. 
ఉదా:-నిర్ +భయము =భయములేనిది.
         యధా +శక్తి=శక్తికొలది.
క్లుప్తముగా :పూర్వపదార్ధ ప్రధానము---అవ్యయీభావ సమాసము.
                   ఉత్తరపదార్ధ ప్రధానము---తత్పురుషము 
                    అన్యపదార్ధ ప్రధానము---బహువ్రీహి 
                ఉభయపదార్ధప్రధానము---ద్వంద్వము.
(గమనిక:-కర్మధారయ,ద్విగువు తత్పురుష భేదములే.ఈ 
సంధులు,సమాసాలు ప్రాచీన గ్రంధములు చదివేటప్పుడు మనకు అర్దమగుటకు తోడ్పడతాయి.అటులనే ముందు తెలపబోయే ఛoదో విషయాలు గూడా.)    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి